calender_icon.png 3 February, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కటి ఇవ్వండి చాలు

03-02-2026 12:00:00 AM

ఉమ్మడి జిల్లాలో సీపీఐ పరిస్థితి

కరీంనగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో ముం దుండి నడిపి ఉమ్మడి జిల్లాలో ఎర్రజెండాను రెపరెపలాడించిన వందేళ్ల చరిత్ర గల సీపీఐ పార్టీ బల్దియా ఎన్నికల్లో టికెట్లను అడుక్కునే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో మిత్రపక్షంగా ఉన్న సీపీఐ బల్దియా ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించింది.

అయితే పలుచోట్ల ఆశిం చిన స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ససేమిరా అంటుండడంతో ఒక్క సీటైనా ఇవ్వండని అడుగుతున్నారు. ఒకప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం సీపీఐకి కంచుకోటగా ఉండేది. ఇక్కడినుండి దేశిని చిన్నమ ల్లయ్యతోపాటు ప్రస్తుతం సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహించారు.

హుస్నాబాద్ మున్సిపాలిటీలో 5 వార్డుల్లో సీపీఐ ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసి ప్రస్తుతం అ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు టికెట్ కోసం పరుగులు తీశారు. ఐదు కాకుండా ఒకటితో సరిపెట్టుకోవాలని మంత్రి సూచించడంతో దానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే అది రేపు వీరు కోరుతున్న స్థానంలో బీఫాం ఇవ్వకపోతే మిత్రబంధం చెడిపోయే ప్రమాదం ఉంది.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీపీఐ కార్యాలయం గణేష్ నగర్ లో ఉంటుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో నాలుగు చోట్ల సీపీఐ ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయగా, సీపీఐ కార్యాలయ ప్రాంతమైన 57వ డివిజన్లో సీపీఐకి కేటాయించేందుకు ఒప్పుకున్నారు. జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం లాంటి చోట్ల టికెట్లు ఆశించినప్పటికి ఫలితం దక్కని పరిస్థితి నెలకొంది.

అక్కడ ఒకటి.. ఇక్కడొక స్థానంతో సీపీఐ సరిపెట్టుకుంటుండడంతో ఆ పార్టీ ఆశావహులు నిరుత్సాహ పడుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడిఉండాలి కనుక బయట చెప్పుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు చాడ వెంకట్ రెడ్డి నుండి కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ వరకు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉపన్యాసాలు ఇచ్చి ఊదరకొట్టారు కానీ పార్టీని నమ్ముకున్న క్యాడర్ కు అనుకున్న స్థాయిలో టికెట్లు ఇప్పించడంలో విఫలం చెందారు. 

సిపిఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్ కార్పొరేషన్ లో 9 డివిజన్లలో పోటీ చేస్తామని ప్రకటించి నేడు ఒక్కటితో సరిపెట్టుకుంటున్నారు. కనీసం 40వ డివిజనైనా వస్తుందనుకుంటే అది రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.