15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేలా పోరాడారు

03-02-2026 12:03 AM

కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాం తి): ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నిన్న ఉదయం నుంచే గ్రామ గ్రామా న గర్జించిన మా కార్యకర్తలకు, సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచిన వారియర్‌లకు,   కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పేలా పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పోస్టు చేశారు.