3 June, 2026 | 1:40 AM

త్యాగాల చరిత్రకు న్యాయం

03-06-2026 12:57 AM
  1. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో రా్రష్ట్ర ఆవిర్భావ శు భాకాంక్షలు తెలియజేశారు. జూన్ 2.. త్యాగా ల చరిత్రకు న్యాయం జరిగిన రోజు, అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు, తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు, నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు అని పేర్కొన్నారు.

కేసీఆర్ ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుందన్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలి పాం.. అని అన్నారు.