13 June, 2026 | 2:15 AM

అద్విక్ కుటుంబానికి న్యాయం చేయాలి

13-06-2026 01:04 AM
  1. కుక్కకాటు బాధితుడిని పరామర్శించిన బీజేపీకి చెందిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు 
  2. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో వినతిపత్రం అందజేత

ఎల్బీనగర్, జూన్ 12 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీచర్స్ కాలనీలో మే 11న కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అద్విక్ కుటుంబ సభ్యులను బీజేపీ ఎల్బీనగర్ ఇన్ చార్జి, మేడ్చల్ జిల్లా ప్రభరి సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి నాయి కోటి పవన్ పరామర్శించి, చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... అద్విక్ ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందాడని, చికిత్సకు సంబంధించిన బిల్లు మొత్తం రూ 11,85,503 లకు చేరిందని, ఈ ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో చిన్నారి అద్విక్ చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కుటుంబ సభ్యులకు జీహెచ్‌ఎంసీ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అయితే ప్రస్తుతం ఆసుపత్రి యాజమాన్యం బిల్లు చెల్లించాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అద్విక్ చికిత్సకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రభుత్వం వెంటనే విడుదల చేసి కుటుంబానికి అండగా నిలవాలని,  ఇందిరమ్మ ఇల్లును ప్రకటించాలని డిమాం డ్ చేశారు. సంబంధిత అధికారులతో మా ట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం  చే యిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లేశ్, శ్రీధర్ రెడ్డి, మహేశ్, సతీష్, రఘునందన్ జోషి, అద్విక్ తండ్రి సుమన్, కేతాన్ పాల్గొన్నారు.