25-05-2025 12:00:00 AM
-నిరుద్యోగులను దోచుకుంటున్న నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలను మూసివేయాలి
-వీటిని అరికట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి
-ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్
ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి) : నేర పూరిత నమ్మక ద్రోహం చేస్తున్న మాదాపూర్, గచ్చి బౌలి లోని స్కిల్ హబ్ వంటి నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీ లను మూసివేయాలని, బోర్డు తిప్పేసిన ప్యూరోపాల్ క్రియేషన్స్, ఐటీ సోలుషన్స్ కంపెనీ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలనీ ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు.
ప్యూరోపాల్ ఐటీ సంస్థ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలనీ, నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీ లను మూసివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
బాధిత నిరుద్యోగులతోపాటు పాల్గొన్న డాక్టర్ దిడ్డి సుధాకర్ ధర్నానుద్దేశించి మాట్లాడుతూ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ వద్ద శిక్షణ పొందితే ఆయా సంస్థల్లో జాబ్ గ్యారెంటీ అంటూ నిరుద్యోగులను ఆకర్షించి మాదాపూర్ లోని స్కిల్ హబ్ కన్సల్టెన్సీ సంస్థ మోస పూరితంగా గచ్చి బౌలి లోని ప్యూరోపాల్ ఐటీ సోలుషన్స్ లో ఉద్యోగాలు ఇప్పించిందని, ప్యూరోపాల్ ఐటీ సోలుషన్స్ ఒక్కొక్కరి నుండి లాప్ టాప్, సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండు లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిందని, చేరిన రెండు నెలలకే జీతాలు కూడా ఇవ్వకుండా ఆ కంపెనీ బోర్డ్ తిప్పేసిందని, దింతో దాదాపు 200 మంది ఉద్యో గులు రోడ్డున పడ్డారని చెప్పారు గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేసి వారం రోజులు గడిసిన ఇప్పటివరకు పోలీసులు వారిపై చెర్యలు తీసుకోలేదని అయన వాపోయారు.
నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలు, కంపెనీలు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ తప్పుడు హామీలతో అనేక మంది ఐటీ ఉద్యోగ ఆశావహులను మోసం చేస్తున్నారని అన్నారు. నకిలీ ఐటీ జాబ్ రాకెట్లను అరికట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
ఈ ధర్నాలో ఆప్ యువజన విభా గం రాష్ట్ర నేత విజయ్ మల్లంగి, బుర్ర రాము గౌడ్, డా. లక్ష్య నాయుడు, రాకేష్ రెడ్డి, బాబూలాల్ పవార్, అజీమ్ బేగ్, రాకే ష్ రెడ్డి, షాబాజ్, లియాఖత్ ఖాన్, హేమ జిల్లోజు, మదన్ లాల్, గుత్తా నాగేశ్వర్ రావు, టి.రాకేష్ సింగ్, సోహైల్, దర్శనం రమేష్, అబ్బాస్, జీషాన్, రామన్ స్వామి, భాదితులు, తదితరులు పాల్గొన్నారు.