calender_icon.png 25 May, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

24-05-2025 11:29:54 PM

మండల విద్యాధికారి సుధాకర్..

రాజాపూర్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తుందని మండల విద్యా అధికారి సుధాకర్(Mandal Education Officer Sudhakar) అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు అధునాతన బోధనా పద్ధతులలో విద్యార్థులకు బోధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని రకాల హంగులతో వసతులతో పాఠశాలలను బలోపేతం చేస్తుందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఉపాధ్యాయులకు బోధనలో కొత్త పద్ధతులను ప్రమాణాలను పెంచడానికి రాజాపూర్ మండలంలోని సెకండరీ గ్రేడ్ టీచర్లకు తెలంగాణ సమగ్ర శిక్ష, తెలంగాణ విద్యా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని డిజిటల్ తరగతుల రూపంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో మండల విద్యా శాఖ అధికారి సుధాకర్, ఉపాధ్యాయులు ఆర్పీలు, రవీందర్ రెడ్డి, రవి, రవీందర్ నాయక్, నాగయ్య, అభిలాష్, శివకుమార్, పురేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.