28 June, 2026 | 12:21 PM

Breaking News

పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •  

వరద బాధితులకు న్యాయం చేయాలి.. ఎమ్మార్వోకి వినతిపత్రం

27-09-2024 08:04 PM

కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని చనుపల్లి, కిష్టాపురం, గొండ్రియల, కొత్త గూడెం,గ్రామాల నందు పాలేరు వాగు ఉదృతంగా మారడంతో వరద కుటుంబాలకు న్యాయం చేయాలని బిఆర్ఎస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు సర్వే చేసి పేర్లు రాసుకొని వెళ్లిన లబ్ధిదారుల లిస్టులో బాధితుల పేర్లు లేకపోవడం బాధాకరమని అన్నారు. వరద బాధితుల విషయంలో రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సింది పోయి బాధితులకు అన్యాయం చేసే విధంగా కొంతమంది రాజకీయాలు వ్యూహాన్ని అధికారులపై రుద్దడం విడ్డూరంగా ఉందని అన్నారు. బాధితులకు అండగా బిఆర్ఎస్ ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు అఫ్జల్ సైదిరెడ్డి అక్బర్ శివా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.