ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీ
యోచియోన్: ఆర్చరీ స్టేజ్ ప్రపంచకప్‌లో తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మరోసారి మెరిసింది. ఇప్పటికే ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టిన సురేఖ తాజాగా మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో సురేఖ జోడీ 158 హాన్ సూంగ్ జెవాన్ జంటను చిత్తు చేసి తుదిపోరుకు చేరుకుంది. అంతకముందు తొలి రౌండ్‌లో సురేఖ జోడీ 159 వియత్నాం ఆర్చర్లపై, క్వార్టర్స్‌లో 156 మెక్సికో ద్వయంపై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక శనివారం జరగనున్న మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో సురేఖ జోడీ.. అమెరికాకు చెందిన ఒలివియా డీన్ సాయర్ సుల్లివన్ జంటను ఎదుర్కోనుంది. ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగం ఫైనల్ కూడా శనివారమే జరగనుంది. దీంతో జ్యోతి రెండు మెడల్స్ దక్కించుకునే అవకాశముంది. ఇక రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్టార్ ఆర్చర్ దీపికా కుమారి సెమీస్‌లో అడుగుపెట్టి పతకం రేసులో ముందంజ వేసింది. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక.. వరుసగా టింకారా (9 దావో (6 లిసా బార్బెలిన్ (6 ఎలిఫ్ బెర్రా (6 ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.






