4 July, 2026 | 1:51 PM

సెమీస్‌లో సింధు

25-05-2024 02:13 AM

కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేషియా మాస్టర్స్ టోర్నీలో సత్తా చాటుతోంది. టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన హాన్ యూను ఓడించిన సింధూ సెమీస్‌కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం సింధు 21 14 21 తో హాన్ యూను మట్టికరిపించింది. 55 నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు.. రెండో గేమ్‌తో పరాజయం పాలైంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఫుంజుకున్న సింధు ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా చెలరేగి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. గత నెల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హాన్ యూ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్న సింధు టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. శనివారం జరగనున్న సెమీఫైనల్లో బుసానన్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడనుంది. మరో సింగిల్స్‌లో అష్మిత చలీహ ఓటమి చవిచూసింది. అష్మిత 10 15 జాంగ్ యీ మాన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో క్వార్టర్స్‌లోనే ఆమె పోరాటం ముగిసింది.