11 April, 2026 | 9:39 PM

మహిళల విద్యాభివృద్ధికి రూపకర్త జ్యోతిరావు పూలే

11-04-2026 08:03 PM

మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని యాదవ్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అణగారిన వర్గాల మహిళల విద్యాభివృద్ధికి రూపకర్త, మానవ హక్కుల అవిశ్రాంత పోరాట యోధుడు, సమ సమాజ స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం ఘట్కేసర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. అడహాక్ కమిటీ కన్వీనర్ బర్ల దేవేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, డీసీసీ సెక్రటరీ మామిండ్ల ముత్యాల్ యాదవ్ తో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ మహిళలను చదువుకు దూరం చేయడాన్ని నిరసిస్తూ తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి బాలికలకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి చదువు నేర్పించిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు.