జ్యోతిష్మతి విద్యార్థుల అంతర్జాతీయ ఘనత
కరీంనగర్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి):జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్), కరీంనగర్ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటారు. దు బాయ్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇన్నోవేషన్ సమిట్ & రిట్రీట్ 2026 లో పాల్గొని ఫైనల్స్కు చేరుకొని కళాశాలకు గౌరవాన్ని తెచ్చారు.
భారతదేశం అంతటా నుండి 1700కు పైగా బృందాలు పాల్గొనగా, జ్యోతిష్మతి కళాశాల విద్యార్థుల బృందం ఫైనల్స్కు ఎంపికైంది. కళాశాల నుంచిఅజిత్ షణగొండ, మొహమ్మద్ షోయబ్ అ ఫ్ఫాన్, అక్షిత్ షణగొండఅనే విద్యార్థులు ప్రాజెక్ట్ డీడీ పేరుతో ఈ పోటీలో పాల్గొన్నారు.
ఈ ప్రా జెక్ట్ ద్వారా అధికంగా మిగిలిపోయే ఆహారాన్ని సమర్థవంతంగా వినియోగించడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, ఫుడ్ క్రెడిట్స్ ప్లాట్ఫామ్ ద్వారా అవసరమైన వారికి ఆహారం అందించడం ప్ర ధాన లక్ష్యంగా ఉంది.విద్యార్థులకుఐ ఎడ్ ఎఫ్ వ్యవస్థాపకులు జే.ఏ. చౌదరిమరియుటాభీ వ్యవస్థాపకులు, చైర్మన్ & గ్రూప్ సీఈఓ ప్రసాద్ గుండుమోగులసర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సం దర్భంగా జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు విద్యార్థులను అభినందిస్తూ, నవోత్తేజం, సామాజిక బాధ్యత, వ్యాపార దృక్పథం కలిగిన ప్రాజెక్ట్లను ప్రోత్సహించడమే కళాశాల లక్ష్యమని తెలిపారు.సెక్రటరీ, కారస్పాండెంట్ జె. సుమిత్ సాయి మాట్లాడుతూ, ఇలాంటి అంతర్జాతీయ స్థాయి కార్యశాలో పాల్గొనడం సంస్థలోని ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ మరి యు వాస్తవ సమస్యల పరిష్కారంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ప్రిన్సిపల్ డా. టి. అనిల్ కుమార్, డీన్ (అకాడెమిక్స్ & ఆడిట్) డా. పి.కె. వైశాలి, విభాగాధిపతులు , అధ్యాపకులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.






