17 April, 2026 | 11:45 AM

Breaking News

అన్ని వర్గాలను మోసం చేశారు

07-02-2026 12:52 AM

ఎమ్మెల్సీ చల్లా , ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్, ఫిబ్రవరి 6: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్ర జలను మోసం చేసిందని ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. శుక్రవారం వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పట్టణంలో పురవీధుల్లో నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 2,500 నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు ఏమైందన్నారు. మోసపూరితమైన హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. కెసిఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు.