23 June, 2026 | 10:41 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

కాళేశ్వరం పార్వతి బ్యారేజీ కరకట్టకు పొంచి ఉన్న ప్రమాదం

21-07-2024 12:19 PM

పెద్దపల్లి, మంథని,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పార్వతి (సుందిళ్ల) బ్యారేజీ కరకట్టకు ప్రమాదం ప్రమాదం పొంచి ఉంది. మూడు సంవత్సరాల క్రితం వరుసగా కురిసిన వర్షాలు పార్వతి బ్యారేజీలోకి వచ్చి చేరిన వరద నీటి ప్రవాహంతో పార్వతి బ్యారేజీ కరకట్ట డామేజ్ అయింది. అధికారులు అప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. గత మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో కరకట్ట పూర్తిగా తెగిపోయే అవకాశం కనిపిస్తోంది. కరకట్ట కోతకు గురైతే డ్యాం పక్కనే ఉన్న బెస్తపల్లి, సిరిపురం గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు భయందోళనకు చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.