16 April, 2026 | 5:57 AM

పేదప్రజల పాలిట కల్పవృక్షం ఉపాధి హామీ పథకం

22-12-2025 01:43 AM

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో స్వర్ణ యుగం 

బిజెపి టిఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశారు 

పబ్లిక్ గార్డెన్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం ఒక సర్వ యుగంలా ఉండేదని, అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అం దించామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నా యిని రాజేందర్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ ట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని బిల్లు ప్రవేశపెట్టిన క్రమంలో ఏఐ సీసీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పబ్లిక్ గార్డెన్ లోని మహా త్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధి పథకం ఒక సంక్షేమ పథకం కాదు ఇది చట్టబద్ధమైన హక్కు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గా యి స్థానికంగా ఉపాధి కల్పన జరిగిందని, మహిళలకు ఆర్థిక స్వ వాళ్ళ మన కల్పించిన పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. దళితులు గిరిజనులను వెనుకబడిన వర్గాలకు ఈ పథకం ఒక రక్షణ కవచంగా పనిచేసిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిం దని గ్రామాల్లో చెరువులు, కాలువలు, రహదారులు పచ్చదనం పెంపు వంటి ఆస్తులు సృష్టించిందన్నారు.

ఉపాధి హామీ పథకం వల్ల గ్రామ పంచాయతీలకు అధికార వికేంద్రీకరణ జరిగిందని, పేరు మార్చడం ద్వారా కాదు ప్రజల హక్కులు కల్పించడం ద్వారా నిజమైన వికసిత్ భారత్ సాధ్యమవుతుందని, చట్టాల పేర్లు మార్చడం రాజకీయ ప్ర చారం తప్ప ప్రజలకు ఉపయోగం లేదని గత 11 నెలలుగా ఉపాధి హామీ పథకానికి తగిన బడ్జెట్ కేటాయింపులో పూర్తిగా విఫలమైందని, పని దినాలు తగ్గించి కూలీలకు చె ల్లింపులు ఆలస్యం చేయడం ద్వారా పేదల జీవనాన్ని దెబ్బతీసిందని, కోవిడ్ తర్వాత పెరిగిన నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు కేం ద్రం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. బిజెపి నేతలు మత విద్వేషాలు రె చ్చగొట్టి ప్రజలను మోసం చేస్తున్నారని అ న్నారు. బిఆర్‌ఎస్ నేతలకు గాంధీ గొప్పత నం తెలియదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శిలు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి శ్రీనివాసరావు, టిపిసిసి మెంబర్ బత్తిని శ్రీనివాసరావు, జి ల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, మామిం డ్ల రాజు, విజయ శ్రీ రజాలి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పెరుమండ్ల రామకృష్ణ, సోషల్ మీడియా పార్లమెంటరీ కన్వీనర్ ఎం.డి నేహా ల్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎనుకుంటి నాగరాజు, తాడిశెట్టి వి ద్యాసాగర్, హసన్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఎనుకుంటి పున్నం చంద ర్, తాళ్లపల్లి సుధాకర్, తడుక సుమన్ గౌడ్, కనపర్తి కిరణ్ కుమార్, హసన్ పర్తి మండల సోషల్ మీడియా కన్వీనర్ బిగుల్ల సురేష్, కాంగ్రెస్ శ్రేణులు వీసం సురేందర్ రెడ్డి, మండల సమ్మయ్య, బుస్సా నవీన్ కుమార్, జనగాం శ్రీనివాస్, తాళ్ల మధు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.