22-12-2025 01:44:08 AM
హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): రాష్ట్రంలో సోమ, మంగళవా రల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై చలితీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. సోమ, మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్‌తోపాటు కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని తెలిపింది.
ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో గతేడాది కంటే ఈసా రి అత్యల్పంగా 5.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మోయినా బాద్‌లో 6.9, వికారాబాద్ జిల్లా నవాబ్‌పే టలో 7.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొ త్తం 14 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.