calender_icon.png 22 December, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్షల్ ఆర్ట్స్ పిల్లలకు శారీరక ధృడత్వమే కాకుండా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది

22-12-2025 01:41:50 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రవీందర్ రెడ్డి 

హనుమకొండ,డిసెంబర్ 21 (విజయ క్రాంతి): మార్షల్ ఆరట్స్ వల్ల పిల్లలలో శారీరక దృఢత్తమే కాకుండా ఆత్మవిశ్వాసము, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన 4వ ‘నేషనల్ ఓ పెన్ మార్షల్ ఆరట్స్ ఛాంపియన్షిప్ పోటీలను హనుమకొండ లోని జక్రియా ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు తమ నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా క్రమశిక్ష ణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. మార్షల్ ఆరట్స్ వంటి క్రీడలు యువతలో ఆత్మరక్షణతో పాటు మానసిక బలాన్ని కూడా పెంచుతాయని పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,నాయకులు కుమార్ యాదవ్, నన్నపనేని భరత్,పల్లపు రమేష్ నిర్వాహకులు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.