2 July, 2026 | 2:33 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన

02-07-2026 01:58 PM

తంగళ్ళపల్లి జూలై 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామ బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి కోతి మృతి చెందింది. అయితే తల్లి చనిపోయిందనే విషయం తెలియని పసి కోతి ఆమె శరీరాన్ని గట్టిగా హత్తుకుని, ఒడిలోనే నిద్రపోయిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

తల్లి ఒడిలోనే తనకు రక్షణ ఉందనే అమాయక నమ్మకంతో ఉన్న ఆ చిన్నారి కోతి దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. తల్లి ప్రేమకు హద్దులు లేవని, అది మనుషులకే కాదు మూగజీవాల్లోనూ అంతే గొప్పదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ హృదయ విదారక దృశ్యాలను చూసిన స్థానికులు భావోద్వేగానికి లోనవగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వేలాది మంది నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. తల్లి–బిడ్డల అనుబంధానికి ఈ ఘటన ఓ మౌన సాక్ష్యంగా నిలిచింది.