2 July, 2026 | 3:03 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్

02-07-2026 02:13 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ గేటు వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... గన్ పార్క్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. మంత్రి జూపల్లితో చర్చ కోసం గన్ పార్క్ బయలుదేరితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచన్‌బాగ్‌కు వెళ్లి, అక్కడ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలను పరామర్శిద్దామని అనుకుంటే.. గేటు నుంచి అడుగు బయట పెట్టకుండా భారీగా పోలీసులను మోహరించారని తెలిపారు. అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం, ఇక్కడ పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. చర్చించడానికి దమ్ము లేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వెన్నుచూపి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.