2 July, 2026 | 3:03 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

02-07-2026 02:14 PM

 బోథ్, (విజయక్రాంతి): ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతున్న డిసిసి కార్యదర్శి లోలపు పోశెట్టి చౌహన్ హరి సింగ్ లు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల్లో ఉన్న రైతన్న ఆదుకోవాలని ఉద్దేశంతో రైతు భరోసనిధులు వేయడం జరుగుతుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులు జిల్లా రైతాంగానికి అండగా ఉన్నారు అన్నారు.

మండలంలో తాసిల్దార్ కార్యాలయానికి రెండు కోట్ల నిధులు మంజూరి చేయించడంలో కృషి చేశారన్నారు 9000 కోట్ల రూపాయల నిధులు రైతు భరోసా కోసం విడుదల చేయడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు కార్యక్రమంలో బూతు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనీష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునేశ్వర సోమన్న జుంగల భోజన ఆత్మ డైరెక్టర్ శ్రీధర్ ఉండే మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమృత రావు పాటిల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహిమూద్ పార్టీ నాయకులు చెట్లపల్లి అశోక్ భాశెట్టి సుదర్శన్ కసిరే పోతన్న గుడాల శేఖర్ గంగారెడ్డి భీమ్రావు పాటిల్ పరుశురాం నానాజీ రాంచందర్ చంద్రకాంత్ రాజారామ్ సంతోష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు