28 August, 2026 | 5:22 PM

విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం

02-07-2026 01:59 PM

ముత్తారం, జూలై 02(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని జిల్లాలపల్లి  గ్రామపంచాయతీ సమీపంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు చొప్పరి నారాయణకు చెందిన గౌడ్ గేదె విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయ భూమి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవాహం తగలడంతో గేదె ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.70 వేల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. సంఘటన విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని రైతును ఓదార్చారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటనపై విచారణ జరిపి, నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.