calender_icon.png 20 November, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత..

19-11-2025 10:50:03 PM

కీసరగుట్ట క్షేత్రంలో ప్రత్యేక పూజలు..

కీసర (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kalvakuntla Kavitha) బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కవితకి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, తాను చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం కవితకి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కవిత గారితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో కీసరగుట్ట ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.