calender_icon.png 20 November, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టజీవుల గొంతుక సీపీఐ

20-11-2025 12:00:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలనరసింహ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

సంస్థాన్ నారాయణపూర్, నవంబర్ 19 (విజయ క్రాంతి): సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం సిపిఐ ఎల్లప్పుడు  పోరాడుతుందని సిపిఐ కార్యవర్గ సభ్యులు బాల నరసింహ, ఎమ్మెల్సీ నెలకుంటి సత్యం అన్నారు. ఈనెల 15న గద్వాల నుంచి ఖమ్మం వరకు ప్రారంభమైన ప్రచార బస్సు జాత బుధవారం మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు, గట్టుప్పల్,సంస్థాన్ నారాయపురం చౌటుప్పల్ మండలాల మీదుగా కొనసాగింది. 

సంస్థాన్ నారాయణపురం మండలానికి చేరుకున్న సందర్భంగా సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో భారీ  ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టజీవుల  సమస్యల పరిష్కారానికై సిపిఐ గర్జించే గొంతుకై నిలబడుతుందన్నారు. ఎకరానికి పత్తి 12 క్వింటాలు అమ్మాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం 7 క్వింటాలకు పరిమితం చేసి మిగిలిన పత్తిని పరోక్షంగా దళారులకు అమ్మే విధంగా చేస్తూ వారిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఈ నెల 26న ఖమ్మంలో జరగబోయే  100 సంవత్సరాల ముగింపు సభ దేశ, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలబెడుతుంద న్నారు.

ఈ సభకు సిపిఐ కార్యకర్తలు కార్మికులు కర్షకులు శ్రామికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు  బోడ సుదర్శన్, ఎండి ఇమ్రాన్,  జిల్లా సమితి సభ్యులు చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ, నాయకులు మంచాల జంగయ్య, మంచాల సైదులు, పల్లె మల్లారెడ్డి, వీరమల్ల యాదయ్య, సుర్వి నరసింహ, పందుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.