calender_icon.png 20 November, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.లక్ష ఆర్థికసాయం

20-11-2025 12:00:00 AM

సంస్థాన్ నారాయణపూర్, నవంబర్ 19 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన బొడిగె రవి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణ రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బొడిగే రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మృతి చెందిన పిల్లల భవిష్యత్తు కోసం అదనంగా లక్ష రూపాయల సహాయాన్ని అందిస్తానని మాట ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం బుధవారం కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా లక్ష రూపాయలు చెక్కును అందజేశారు. పిల్లల భవిష్యత్తు కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిన కృష్ణారెడ్డికి రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలువేరు నర్సింహ్మ సీనియర్ నాయకులు చెక్క నర్సింహ్మా ,బైకని నరేందర్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ మైలారం రాములు, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు అందె నరేష్ యాదవ్, మాజీ వార్డు మెంబర్ బోయిని నర్సింహ్మ, యూత్ కాంగ్రెస్ నాయకులు చిలువేరు జున్ను, చింతల లింగస్వామి, మినుగు గోపాల్, ఏపూరి శివయ్య, దుర్గం ముత్యాలు, పెద్దగోని వెంకటేష్, పెద్దగోని కృష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.