20 July, 2026 | 6:52 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

కల్వకుర్తి ప్రగతి శంఖారావం

20-07-2026 12:27 AM
  1. గుడిసెలు లేని నియోజకవర్గమే నా లక్ష్యం..
  2.   5,600 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు 
  3. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 
  4. మండలంలో రూ.5కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

మాడ్గుల, జులై 19(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గాన్ని గుడిసెలు లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అందుకోసం మొదటి విడత కింద 5,600 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను అందజేసినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మాడుగుల  మండల పరిధిలోని 9 గ్రామాలు, తాండాల్లో రూ. 5 కోట్ల  నిధులతో చేపట్టనున్న వివిధ సంక్షేమ, ప్రగతి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ముందుగా  కొల్కులపల్లి గ్రమంలో ఐమాక్స్ (హైమాస్ట్) లైట్లు, దివంగత బట్టు రుక్మారెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్, అంతిమయాత్ర రథం, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు రూ.30 లక్షల హెచ్‌ఎండీఏ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. రాజీవ్నగర్ తాండా లో రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, నర్సాయిపల్లి లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం,

రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ,  మాడ్గుల కేంద్రం లో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం విజయ డైరీలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 వేల లీటర్ల చిల్లింగ్ సెంటర్ (BMC) ప్రారంభం, రూ.2 కోట్లతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమిపూజ, రూ.9.60 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రారంభోత్సవం చేశారు.అప్పారెడ్డిపల్లి, అర్కపల్లి, పలుగుతాండా ఈ మూడు గ్రామాల్లో ఒక్కో ఊరికి రూ.30 లక్షల చొప్పున మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ.  

కాశాగూడెం: రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ,చంద్రాయన్పల్లి లో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. 

ప్రజా పాలనలోనే ప్రతి గడపకూ సంక్షే మం

 ఈ సందర్భంగా కొల్కులపల్లిలో కాంగ్రె స్ మండల పార్టీ అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంపార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయడమే ధ్యే యంగా పనిచేస్తోందని, ప్రతి గడపకూ సం క్షేమ పథకాలుఅందిస్తోందని కొనియాడా రు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి మధు సుదన్ రెడ్డి, నాయకులు పద్మా రెడ్డి, అమంగల్ మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,కిషన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు అనురాధ, రజిత,కోటేష్, జగన్,ఏఎంసి డైరెక్టర్ సంపత్, నాయకులు కొండల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సాయి రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.