20 July, 2026 | 6:14 PM

Breaking News

అత్యాచారం కేసులో నిందితుడికి 20 వేల జరిమాన   •   బ్యాంక్ వార్షికోత్సవం   •   అదనంగా పిఎంసిహెచ్ బాలుర, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి పత్రం   •   పాత బావి పూడ్చి అంగన్‌వాడీ, పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి   •   రైతులకు ఎల్నీనో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన   •   గణపురంలో 169.4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత   •   కోనరావుపేటలో టీఎస్‌యూటీఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభం   •   ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ   •   టీఎస్‌యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •  

తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బోనం’

20-07-2026 12:28 AM

బోనాల పండుగలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ బోనాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం నగరం లోని కోటగల్లిలో గల కట్ట మైసమ్మ ఆల యం, నాందేవ్ వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ఆషాఢ మాసం తెలంగాణకు ప్ర త్యేక మాసం అన్నారు. గ్రామ దేవతలకు పూ జిస్తూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పా డి పశువులు ఆరోగ్యంగా ఉండాలని కొలిచే పండగ అన్నారు. బోనాలు మన పూర్వీకుల సంప్రదాయాన్ని.. గ్రామదేవతల పట్ల ఉన్న విశ్వాసాన్ని తరతరాలకు అందించే ఆధ్యాత్మిక వేడుక అని, బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యమని పేర్కొన్నారు.

మహిళలు పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని.. కొత్త కుండలో పెట్టి, వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించి తలపై మోసుకుంటూ అమ్మవారికి సమర్పిస్తారన్నారు. పోతురాజుల నృత్యాలు, ఘటం ఊరేగింపులు, రంగం వంటి సంప్రదాయాలు పం డుగకు మరింత వైభవాన్ని తీసుకువస్తాయన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, జ్యోతి మురళి, బం టు ప్రీతి ప్రవీణ్, కోటగల్లి మైసమ్మ ఆలయ ప్రతినిధులు దేవేందర్, గౌడ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.