15 May, 2026 | 6:18 PM

కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత

21-06-2024 12:15 AM

మంచిర్యాల, జూన్ 20 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వివిధ శాఖల నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతో తెలంగాణలో ఖజానా ఖాళీ అయిందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన అంది స్తూ నిధులను సమకూర్చే దిశగా పయనిస్తున్నామని చెప్పారు.