15 May, 2026 | 5:00 PM

అఖిల భారత సర్వీసెస్ అధికారుల పర్యటన

21-06-2024 12:15 AM

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 20(విజయక్రాంతి): తెలంగాణ దర్శన్‌లో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన అఖిల భారత సర్వీసెస్ అధికారుల బృందం గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్‌శర్మను బృందం సభ్యులు కలిశారు. ఏడుగురు సభ్యులున్న ఈ అధికారుల బృందం జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, సింగరేణి ఉపరితల గనిబె సందర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.