16 April, 2026 | 3:49 AM

దిగ్గజ దర్శకుడి ప్రాజెక్టులో కామాక్షి

16-04-2026 02:14 AM

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన దిగ్గజ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో వస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఒక శక్తిమంతమైన పాత్రలో నటిస్తోంది. ఈ మేరకు కామాక్షి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. “నా తదుపరి చిత్రం ‘అగధ’. కొన్ని కలలు కేవలం నెరవేరడమే కాదు, అవి మనల్ని వినయవంతులుగా చేస్తాయి.

నిర్మాత -దర్శకుడు, దిగ్గజ ఎంఎస్ రాజు  మా అందరికీ కథ చెప్పడంలో ఒక పాఠశాల వంటివారు. ఈ రోజు ఆయన తదుపరి చిత్రం పోస్టర్‌ను పంచుకోవడం, ఈ ప్రయాణంలో ఒక చిన్న భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. టాలీవుడ్‌కు రూపునిచ్చిన ఒక దిగ్గజం పక్కన నిలబడటం ఒక అద్భుతమైన, భావోద్వేగమైన, ఒక పెద్ద బాధ్యతగా అనిపిస్తోంది. చిన్నప్పటి కల నెరవేరినట్లుగా అనిపిస్తోంది” అని రాసుకొచ్చింది.