సైయారా కాంబో రిపీట్
16-04-2026 02:13 AM
నిరుడు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ‘సైయారా’ కాంబో రిపీట్ కాబోతోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథతో అదరి దృషిని ఆకర్షించిన ఈ టీమ్ మరోమారు కలిసి వస్తున్నట్టు అధికారికంగా చేసిన తాజా ప్రకటనతోనే ఈ ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి.
డైరెక్టర్ మోహిత్ సూరి, నిర్మాత క్షయ్ విధాని, జెన్‌జెడ్ స్టార్స్ అహన్ పాండే, అనీత్ పద్దా కలయికలో మరో బలమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. యశ్ రాజ్ ఫిలమ్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రారంభమై, 2027లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.






