calender_icon.png 19 June, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐతో కమల్ వినూత్న ప్రయోగం

07-09-2024 12:19:22 AM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ నటులలో కమల్ హాసన్ ఒకరు. కమల్ హాసన్ బ్రిలియంట్ డైరెక్టర్ కావడంతో పాటు పలు చిత్రాలను ని ర్మించారు. 69 ఏళ్ల వయసులో పలు సినిమాలతో బిజీ గా ఉన్న ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కోర్స్ కోసం అమెరికా వెళ్లారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకునే ఆయన కృషిని అభినందించాల్సిందే.

అమెరికాలోని టాప్ యూనివర్శిటీలో క్రాష్ కోర్సులో చేరిన ఈ నటుడు ఈ వారాంతంలో క్లాసులు ప్రారంభించనున్నాడు. ఈ కోర్సు 90 రోజుల పాటు ఉంటుంది కానీ కమల్ హాసన్‌కు చాలా సినిమా కమిట్ మెంట్స్ ఉండటంతో 45 రోజుల్లో పూర్తి చేస్తారు. దీంతో కమల్ హాసన్ తన ఫ్యూచర్ ప్రాజెకట్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

’విక్రమ్’ సూపర్ సక్సెస్ తర్వాత కమల్ హాసన్ చేతి లో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. తన రెమ్యూనరేషన్ కూడా పెంచడంతో ఈ నటుడికి విపరీతమైన డిమాం డ్ ఏర్పడింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. మణిరత్నం తెరకెక్కిస్తున్న ’థగ్ లైఫ్’ సినిమాతో బిజీగా ఉన్న కమల్ హాసన్ ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. భారతీయుడు-3 షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. అలాగే కల్కి 2898 ఏడీ సీక్వెల్,  అట్లీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించనున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.