6 June, 2026 | 6:16 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

వరద బాధితులకు పుష్ప మేకర్స్ విరాళం

07-09-2024 12:17 AM

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవితాలు అస్తవ్యస్తం కావడంతో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఆయా ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. టాలీవుడ్ నటులు, నిర్మాణ సంస్థలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.50 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విరాళం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలు త్వరలోనే ఈ సంక్షోభం నుంచి కోలుకుంటాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, అశ్వినీదత్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సహాయక చర్యలకు విరాళాలు అందించారు.