13 August, 2026 | 8:44 PM

బంజారా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కమల్ సింగ్

13-08-2026 07:27 PM

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి కిషన్ నాయక్ తండాకు చెందిన మూడ్ కమల్ సింగ్‌ను బంజారా అసోసియేషన్ నారాయణఖేడ్ తాలూకా జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు బంజారా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మలోత్ లావణ్య నాజం నియామక పత్రాన్ని అందజేశారు.

తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన స్టేట్ ప్రెసిడెంట్ మాలోత లావణ్య నాజం, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రాథోడ్, జనరల్ సెక్రటరీ రామచందర్ రాథోడ్‌లకు కమల్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. బంజారా సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.