మండల సోషల్ మీడియా ఇన్‌చార్జీల నియామకం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లుగా రాఘవపేట్ గ్రామానికి చెందిన నత్తిరామ్, వేంపల్లి గ్రామానికి చెందిన పోతు శేఖర్‌ను నియమించారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాలకు సోషల్ మీడియా ఇన్‌చార్జీలను ఎంపిక చేశారు. ఈ సమావేశానికి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు మాట్ల సోమయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎలాల జలపతి రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.






