కామళ్ల నవీన్ జీవితం చిరస్మరణీయం
‘ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్
గరిడేపల్లి, సెప్టెంబర్ 3 : కార్మికులను(workers) సంఘటితం చేసి, వారి హక్కుల(rights) కోసం నిరంత రం పోరాడుతూ వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు కామ్రేడ్ కామళ్ళ నవీన్(Kamalla Naveen) అని ఆయన జీవితం చిరస్మరణీ యం అని ఐఎఫ్టీయూ(IFTU) రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఎం. శ్రీనివాస్(M. Srinivas) అన్నారు.ఆగస్టు 22న మృ తిచెందిన ఐఎఫ్టీయూ సూర్యాపేట జిల్లా అ ధ్యక్షుడు కామళ్ళ నవీన్(Kamalla Naveen) సంతాప సభ(condolence meeting)ను తన స్వగ్రామమైన వెలిదండలో నిర్వహించారు.
ముందుగా నవీన్ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా వి ప్లవ ఉద్యమంలో అవిశ్రాంతంగా పనిచేసిన నవీన్ భౌతికంగా దూరం కావడం బాధాకరమన్నారు. కార్మికులు, ప్రజలు, మహిళలు, యువతలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆ యన.. కార్మికుల హక్కుల కోసం సంఘాల ను నిర్మించి నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు.
గడ్డిపల్లిని కేంద్రంగా చేసుకుని ట్రేడ్యూనియన్ ఉద్యమాన్ని అనేక ప్రాంతాలకు విస్తరించారని తెలిపారు.నవీన్ ఆ శయాలను కొనసాగించడమంటే ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలను నిర్మించడమేనన్నారు. ప్రజల సమస్యలను విస్మరిం చి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రా ధాన్యం ఇస్తున్న పాలకుల విధానాలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపు నిచ్చారు.
సంతాప సభకు ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగయ్య అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్కుమార్, విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు పోటు లక్ష్మయ్య, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయగిరి, ఐఎఫ్టీయూ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు,పాల్గొన్నారు.






