కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం చేయడం సరైనది కాదు
బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ
గరిడేపల్లి (విజయక్రాంతి): కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే 42% రిజర్వేషన్ పరిమితం చేయకుండా, విద్య, ఉపాధి రంగాల్లో కూడా కట్టపరంగా రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
దీనికోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలలో చేర్చి బాధ్యతను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో మోసగించడం సరైంది కాదని ఆయన విమర్శించారు. బీసీ సమాజం హక్కుల కోసం అన్ని స్థాయిల్లో పోరాటం సాగిస్తుందని, బీసీలకు న్యాయం చేయకుండా వెనకడుగు వేస్తే బీసీ వ్యతిరేక నాయకులకు తగిన విధంగా గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.




