calender_icon.png 28 October, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించాలి

28-10-2025 09:03:24 PM

మందమర్రి (విజయక్రాంతి): కార్మికులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. ఏరియాలోని కేకే డిస్పెన్సరీని మంగళవారం సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణంలో పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఐఈడి ఎస్సి కిరణ్ కుమార్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.