30 March, 2026 | 8:23 PM

కనకదుర్గ అమ్మవారి దేవాలయ హుండీ లెక్కింపు

30-03-2026 06:35 PM

రూ.1,53,510 లు ఆదాయం

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత ఏడాది మార్చి 29 నుండి ఈ ఏడాది మార్చి 29 వరకు  భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 1,53,510 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి తెలిపారు.  ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు సమక్షంలో ఎండోమెంట్ జిల్లా అధికారి చింతల పూర్ణచంద్రారెడ్డి పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు.