22 May, 2026 | 7:38 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

తాండూర్ కిచ్చన్నపేట సంఘం మహాజన సభ సమావేశం

30-03-2026 06:33 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి: తాండూర్ కిచ్చన్నపేట సంఘం మహాజన సభ సమావేశం సోమవారం నిర్వహించడం జరిగిందని సీఈవో మురళి తెలిపారు. ఈ సమావేశానికి అఫీషియల్ పర్సన్ ఇంచార్జ్, సీనియర్ ఇన్స్పెక్టర్ సిహెచ్.రాధిక హాజరయ్యారు. తాండూర్ కిచ్చన్నపేట సంఘ సభ్యులు రైతుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి డి.చంద్ర మురళి వార్షిక సంవత్సరం అనగా తేదీ.1.04.2025 నుండి 28.02.2026 వరకు జామ ఖర్చులను సంఘం ముందు ప్రవేశపెట్టారు.

ఈ యొక్క సమావేశంలో యూరియాను మండలాల వారీగా కాకుండా సంఘం యొక్క గ్రామ పరిధిలో ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. సంఘం ఆఫీసు ఆవరణలో ప్రహరీ గోడ నిర్మాణం ఏర్పాటు చేయాలని సూచించారు. దీర్ఘకాలిక రుణాలు వసూళ్లకు ఓటిఎస్ విధానం కల్పించగలరని తీర్మానం చేయడం జరిగిందని సంఘం కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.