16 August, 2026 | 10:35 AM

బెంగాల్‌ ఘోర రైలు ప్రమాదం.. 15కు చేరిన మృతుల సంఖ్య

17-06-2024 01:26 PM

పశ్చిమ బెంగాల్‌: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 15కి చేరింది. ప్రస్తుతం సహాయక చర్యలను  రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బెంగాల్ రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ దుర్ఘటనలో దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు వెల్లడించారు. డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయిగురిలో గూడ్స్ ఢీకొన్నాక కాంచనజంగ ఎక్స్ ప్రెస్ 3 వెనుక బోగీలు పట్టాలు తప్పాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.