పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న చంద్రబాబుకి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు, టిడిపి, జనసేన, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం వీక్షించారు. 22,23 గేట్ల వద్ద నుంచి చంద్రబాబు ప్రాజెక్టును పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులు సీఎంకి వివరించారు. ప్రాజెక్టు ఎడమగట్టు కుంగిన గైడ్ బండ్ ప్రాంతం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణం పనులను బాబు పరిశీలించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా తిలకించారు. అధికారుల నుంచి వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.






