calender_icon.png 5 July, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతున్న నటి

05-07-2025 05:10:19 PM

కన్నడ నటి భావన తల్లి కానుందనే వార్త విస్తృతంగా వినిపిస్తోంది. ఆమె ఇప్పుడు ఆరు నెలల గర్భవతి అని, కవలలకు జన్మనిస్తోంది. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన భావన రామన్న సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె మొదటి అధికారిక ప్రకటనను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. 40 ఏళ్ల వయసులో భావన గర్భవతి కావాలని ఎందుకు నిర్ణయించుకుంది..? ఆ మార్గం ఎలా ఉండేది..? తండ్రి లేకుండా పిల్లలు ఎలా పెరుగుతారు..? సరైన వయస్సులో తల్లి కావడం పట్ల ఆమెకు ఆసక్తి ఎందుకు లేదు..? ఆమె సోషల్ మీడియాలో తన భావాలను బహిరంగంగా వ్యక్తం చేసింది. 

తల్లి కావడం గురించి భావన ఏం చెప్పింది..?

ఇది భావన కొత్త అధ్యాయం, కొత్త లయ అని, తను ఇలా చెబుతానని ఎప్పుడూ ఊహించలేదన్నారు. కానీ ఇక్కడ తను కవలలతో ఆరు నెలల గర్భవతిని అని, తనకు 20-30 సంవత్సరాల వయసులో మాతృత్వం కోరిక మనసులో లేదని తెలిపారు. ఆమెకు 40 ఏళ్లు నిండినప్పుడు వచ్చిన కోరికను కాదనలేకపోయానని చెప్పారు. ఒంటరి మహిళగా, మార్గం సులభం కాదని, చాలా ఐబీఎఫ్ కేంద్రాలు తనన్ను తిరస్కరించాయన్నారు. అప్పుడు భావన్ రామన్న డా.సుష్మను కలిశాను. ఆమె నన్ను ఎటువంటి న్యూనతాభావం లేకుండా స్వాగతించినట్లు వివరించారు. ఆమె మద్దతుతో తన మొదటి ప్రయత్నంలోనే నటి గర్భందల్చినట్లు స్పష్టం చేశారు.

తన తండ్రి, తోబుట్టువులు, ప్రియమైనవారు గర్వంగా, ప్రేమగా ఆమె పక్కన నిలబడ్డారని హర్షం వ్యక్తం చేశారు. కొందరు తన నిర్ణయాన్ని ప్రశ్నించారు. కానీ నటి మనస్సులో దేనికైనా సిద్ధంగా ఉన్నానని, తన పిల్లలకు తండ్రి లేకపోవచ్చు, కానీ వారు కళ, సంగీతం, సంస్కృతి, షరతులు లేని ప్రేమతో నిండిన ఇంట్లో పెరుగుతారని చెప్పారు. వారు దయ, విశ్వాసం, గర్వంతో పెరుగుతారు. నేను తిరుగుబాటుదారుడిగా ఉండటానికి ఈ మార్గాన్ని ఎంచుకోలేదు, నా సత్యాన్ని గౌరవించడానికి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నా కథ, ఒకే ఒక స్త్రీ తనను తాను నమ్ముకునేలా ప్రేరేపించగలిగితే సరిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో రెండు చిన్న ఆత్మలు తనన్ను అమ్మ అని పిలుస్తాయి.. అంతే అని భావన రామన్న రాసుకొచ్చారు.