05-07-2025 11:18:29 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు సమీపిస్తుందని ఆదరాబాదరాగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోం అని వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్లపై రాహుల్ స్పందించారు. ‘అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోదీ తప్పక తలవంచుతారు. నా మాటలు నమ్మకపోతే రాసిపెట్టుకోండి.’ అని వ్యాఖ్యానించారు. అమెరికా వివిధ దేశాలకు సుంకాల విషయంలో ఇచ్చిన గడువు 9తో ముగుస్తున్నందున అంతకంటే ముందే నూతన వాణిజ్యవిధానాన్ని ప్రకటించాలని రెండు దేశాలు చూస్తున్నాయి.