22-05-2025 01:43:07 AM
- కన్నడలో మాట్లాడాలని అడినందుకు కస్టమర్‌తో బ్యాంక్ మేనేజర్ వాగ్వాదం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలు
- ఉద్యోగిని బదిలీ చేసిన ఎస్‌బీఎస్
బెంగళూరు, మే 21: కన్నడలో మాట్లాడాలని అడిగినందుకు బెంగళూరులోని సూర్య నగరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియాలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో కర్ణాటకలో భాషావివాదం రాజుకుంది.
సదరు వీడియోలో కన్నడలో మాట్లాడాలని వినియోగదారుడు, బ్యాక్ మేనేజర్‌ను అడగగా.. కన్నడలోనే తప్పనిసరిగా మాట్లాడాలన్న నిబంధన ఏదైనా ఉందా అంటూ ప్రశ్నిస్తూ ఆ మేనేజర్ వాగ్వాదానికి దిగింది. ఎన్నటికీ కన్నడలో మాట్లా డనని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చింది.
బ్యాంక్ మేనేజర్ వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భాషా సంఘాలు తీవ్ర నిరస వ్యక్తం చేశాయి. కన్నడ భాష పట్ల బ్యాంక్ మేనేజర్ వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ.. బుధవారం కర్ణాటక రక్షణ వేదికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. స్థానిక భాషలో సేవలు అందించడంలో ఎస్‌బీఐ విఫలమైందని ఆరోపించింది. ఆరోపణల నేపథ్యంలో సదరు ఉద్యోగిని ఎస్‌బీఐ బదిలీ చేసింది.
స్పందించిన సీఎం
బెంగళూరులోని ఎస్‌బీఐలో కన్నడ భాషపై జరిగిన వివాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బ్యాంక్ మేనేజర్ పౌరులతో నిర్లక్ష్యంగా వ్యవహరించా రని, ఈ తీరు సరైంది కాదని విమర్శించారు. స్థానిక భాషను బ్యాంక్ ఉద్యోగులందరూ గౌరవించాలని, వినియోగదారులతో స్థానిక భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయాలని సూచించారు. సదరు ఉద్యోగిని ఎస్‌బీఐ బదిలీ చేసిందని, ఇంతటితో ఈ సమస్య సద్దుమణిగినట్టుగా భావిస్తున్నామని ఆయ న పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.