calender_icon.png 21 December, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కరీంనగర్‌ను రెండో రాజధాని చేయాలి’

06-11-2024 12:00:00 AM

కరీంనగర్, నవంబరు 5 (విజయక్రాంతి): ప్రభుత్వం రాష్ట్రానికి రెండో రాజధానిని చేయాలనుకుంటే కరీంనగర్ జిల్లానే చేయాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ కోరా రు. మంగళవారం కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లా లో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్ జిల్లాను రెండో రాజధానిని చేస్తామని చెప్పారని, అదే నిజమైతే కరీంనగర్ జిల్లాకే ఆ అర్హత ఉన్నదన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు కరీంనగరేనని, ఇక్కడ అన్ని రకాల వసతులున్నాయన్నారు.