27-10-2025 05:48:23 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): కార్తీకమాసం సందర్భంగా మొదటి సోమవారంను పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలోని దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది, ఉదయాన్నే భక్తులు దేవాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. దంపతులు పూజారులకు దీపదానం చేశారు. పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం, సాంబశివ దేవాలయం, శివాలయం, గుడి మిట్టపల్లి శివాలయం, పెరిగిద్ద ఆంజనేయస్వామి దేవాలయాల్లో పూజారులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
అలాగే ప్రతిరోజు తెల్లవారుజామున సాంబశివ దేవాలయం నుండి పూజారి పారువెళ్ల రమేష్ తీసుకువస్తున్న జ్యోతికి భక్తుల నుండి మంచి స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు ఈ నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నారు. ఇందులో దేవాలయల పూజారులు పారువెల్ల రమేష్ శర్మ, సౌమిత్రి శ్రావణ్ కుమార్, వల్ల కొండ మహేష్, పోలస అశోక్, కొండపలకల అభిలాష్ లు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తుల ను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు.