27-10-2025 05:45:20 PM
అయ్యప్ప స్వామి ఆలయంలోని శివాలయంలో మాజీ సర్పంచ్ లు ఎర్నేని దంపతుల ప్రత్యేక పూజలు..
కోదాడ: పవిత్ర కార్తీక మాస పుణ్యాలు ప్రజలందరికీ కలగాలని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం తెల్లవారుజామున కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలోని శివాలయంలో ఆయన కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మికతకు మారుపేరు కార్తీక మాసం అన్నారు. కార్తీక మాసంలో పూజలు పుణ్యస్నానాలు ఉపవాసాలు ఆచరిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆయు ఆరోగ్యం కలుగుతాయని పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం అన్నారు. సమాజ సంక్షేమానికే పూర్వీకుల ఆచారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయ్యప్ప స్వాముల దీక్షలు విజయవంతం కావాలన్నారు అనంతరం అయ్యప్ప స్వాములకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.