calender_icon.png 27 October, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

27-10-2025 05:50:29 PM

- చివరి గింజ వరకు కొంటాం

- మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో ఐకెపి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపూ రాకేష్, డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారన్నారు. వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు జరపాలని రైతులను వివరణ ఇబ్బంది పెడితే వెంటనే సమాచార ఇవ్వాలని ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని వారు అన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని వారు సూచించారు, ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాలతో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు వారు వెల్లడించారు.

చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని వారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపూ రాకేష్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, డైరెక్టర్లు కత్తి కనకయ్య, దైత కుమార్, విద్యాసాగర్, మాజీ సర్పంచ్ ముడుగే చంద్రశేఖర్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు ముడిగి నరేష్ నాయకులు ఎర్రం రాజు, గుగ్గిళ్ళ సత్తయ్య, పండుగ ప్రదీప్, రాములు చంద్రయ్య, మధు, దేవరాజ్, మూదం శ్రీనివాస్, బోనాల రమేష్, దూబ్బల మల్లేశం, మహిళా సంఘ నాయకులు రైతులు .గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు ఉన్నారు.