15 June, 2026 | 7:40 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

వర్ధమానుకోట బ్రహ్మంగారి ఆలయంలో కార్తీక వైభవం

05-11-2025 08:33 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలోని విశేషమైన పౌర్ణమి సందర్భంగా బుధవారం ఆలయంలో సహస్ర దీపోత్సవం నిర్వహించారు. దశాబ్దకాలంగా ప్రతి ఏటా ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, వేయి దీపాలు వెలిగించారు. దీపాల కాంతులతో ఆలయం దేదీప్యమానంగా కళకళలాడింది. ఆలయ అర్చకులు శ్రీ బొల్లోజు. బ్రహ్మచారి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన అనుముల. శివనాగప్రసాద్  ఆలయానికి సమర్పించిన పులి హోర ప్రసాదాన్ని భక్తులకు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, యువకులు పాల్గొని ,స్వచ్ఛంద సేవలు అందించారు.