15 June, 2026 | 6:16 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

మఠంపల్లిలో అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా.. భక్తులతో మార్మోగిన ఆలయం

05-11-2025 08:28 PM

మఠంపల్లి: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి అభిషేకం, పడిపూజ ఘనంగా నిర్వహించారు. బత్తుల తిరుపతయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ బుధవారం అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాల మధ్య కొనసాగింది.

భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజ తరువాత పంచామృతాభిషేకం, కుంకుమ, చందన పసుపు బస్మాభిషేకాలను చేశారు. మహా మంగళ హారతితో పూజా కార్యక్రమాలు ముగిశాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి భారీగా అయ్యప్ప మాలధారణ భక్తులు హాజరై అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తుల పాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, భక్తులు ప్రజలు పాల్గొన్నారు.