calender_icon.png 23 July, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా కసిబోజుల సంతోష చారి

22-07-2025 07:10:00 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(Telangana Building Construction Workers Union) జిల్లా కార్యవర్గ సమావేశంలో సంతోషచారిని కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంతోష చారి మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి వహిస్తుందని వెంటనే పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేద కార్మికులకు పనిముట్లతో సహాయ సహకారాలు అందించి లోన్ లు వెంటనే కల్పించాలని, భవనిర్మాణ బోర్డులో యూనియన్ సభ్యులను ఇద్దరినీ  తీసుకోవాలని ఆయన కోరారు.